హైడ్రా(Hydra) కూల్చివేతలను సామాన్యులు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కొందరు ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నారు.

హైడ్రా(Hydra) కూల్చివేతలను సామాన్యులు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కొందరు ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నవారిలో ఎంఐఎం(MIM) అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ(MP Asadussin Owaisi) కూడా ఉన్నారు. ఓవైసీకి చెందిన

మహిళా కాలేజీ సల్కం చెరువు ఆక్రమణలో ఉందని, ఓవైసీ ఆస్పత్రి, ఓవైసీ రిసెర్చ్ సెంటర్ లు డీఎంఆర్ చెరువులకు దగ్గరలో ఉన్నాయని హైడ్రా వీటిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటుందనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ క్రమంలో హైడ్రా వ్యవహారంపై అసదుద్దీన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా? నెక్లెస్‌రోడ్‌(Necklace road) కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది.. నెక్లెస్‌రోడ్‌ను కూడా తొలగిస్తారా?. జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం నాలాపై నిర్మించారు..దాని పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ కార్యాలయాలు చాలా చోట్ల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయి . గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్‌ కోర్టు ఉంది. ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడుతారు. అక్కడికి వెళ్లి చూడండి.. లేదంటే నేను ఫోటోలు కావాలంటే నేను ఇస్తాను. ఎఫ్‌టీఎల్ సమస్యపై మేయర్‌ను కలిసి చెప్పాను.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తాను’ అని అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. చెరువులను కబ్జా చేసి కట్టింది ప్రతీది అక్రమ కట్టడమే! ఆ లెక్కన ఓవైసీ కి చెందిన కొన్ని నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనన్నది నెటిజన్ల వాదన. ఇదే జరిగితే కాంగ్రెస్‌- మజ్లిస్‌ మధ్య సంబంధాలు తెగిపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో!

Eha Tv

Eha Tv

Next Story