అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మృతిని తట్టుకోలేక గుండెలుపగిలే ఏడ్చిందా తల్లి. కొడుకు శవం పక్కనే గుండె ఆగిచనిపోయింది.
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మృతిని తట్టుకోలేక గుండెలుపగిలే ఏడ్చిందా తల్లి. కొడుకు శవం పక్కనే గుండె ఆగిచనిపోయింది. బంధువులు, గ్రామస్తులు చూస్తుండగానే తల్లి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. ఈ విషాదకరమైన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని చౌడాపూర్ మండలం లింగంపల్లిలో చోటు చేసుకుంది. మ్యాకల శ్రీశైలం, వయస్సు 34 గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూమి తగాదాలో సొంత గ్రామానికి చెందిన బాలరాజు, లక్ష్మణ్, రాములు తనను వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగాడు.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. శ్రీశైలం మరణవార్త విన్న తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. కొడుకు శవం పక్కన రోదిస్తూ కింద పడిపోయింది. క్షణాల్లో తల్లి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయాయి. ఈ విషాదకర ఘటన చూసి స్థానికులు కలత చెందారు. తల్లీ కొడుకుల అంత్యక్రియలను ఒకే సమయంలో నిర్వహించారు. శ్రీశైలం ఆత్మహత్యకు కారణమైన బాలరాజు, లక్ష్మణ్, రామును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.