సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తన స్నేహితురాలిపై ప్రియుడితో అత్యాచారం చేయించి వీడియో తీసింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌(Huzurnagar)కు చెందిన రోజా తన స్నేహితురాలి (26)ని ఇంటికి పిలిచి మద్యం తాగించి మత్తులోకి దించింది. ఆతర్వాత తన ప్రియుడు ప్రమోద్‌(Pramodh)తో ఆమెపై అత్యాచారం చేయిస్తూ వీడియో తీసింది. మరొసారి యువతిని ఇంటికి పిలిపించిన రోజా(Roja) ఈసారి తన స్నేహితుడు హరీష్(Harish) కోరిక తీర్చాలని స్నేహితురాలిని కోరింది. ఆమె నిరాకరించడంతో దారుణంగా కొట్టింది. స్నేహితురాలు నిరాకరించడంతో ఆమెపై సదరు యువతి దాడి చేయడంతో వీడియోలు వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి యువతి, ప్రమోద్, హరీష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ehatv

ehatv

Next Story