హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తన్నుపై 25 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న రౌడీ షీటర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. పలు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న పేరుమోసిన షీటర్ మహ్మద్ మెరాజ్ అలియాస్ తన్నును మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ తన్నూ ఎమ్మెల్యేకు సన్నిహితుడని అంటున్నారు. ఆరు నెలల కిందట నమోదైన కేసులకు సంబంధించి అరెస్టయ్యాడు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు కానీ అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య అతడు ప్రచారం చేయడం లేదా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తన్నుపై 25 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దాడి చేసి బెదిరించినందుకు మధురానగర్ పోలీసులు తన్నుపై అర్మ్స్ ఆక్ట్ కింద నమోదు చేశారు. 2023 లో నలుగురు యువకులను చితకబాదిన ఘటనపై మధురానగర్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. నాలా ఆక్రమించి ప్రభుత్వ ల్యాండ్ లో షెడ్స్ వేసినందుకు తన్నుపై జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు.