తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

Modi to address public meetings in Telangana on Wednesday
తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకునే ఆయన మరుసటి రోజు ఉదయం ఎన్నికల ప్రచారానికి వెళ్లే వరకూ రాజ్‌భవన్‌లో బస చేస్తారు.
సోమవారం రాత్రి వరకూ మోదీ పర్యటన షెడ్యూల్ విడుదల కానప్పటికీ.. బుధవారం ఉదయం 10.30 గంటలకు వేములవాడలో, మధ్యాహ్నం వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని తెలుస్తోంది. ప్రధాని పర్యటన దృష్ట్యా మంగళ, బుధవారాల్లో అమలులో ఉండే ఆంక్షల నిమిత్తం ట్రాఫిక్ అదనపు కమిషనర్ ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు.
మంగళవారం సాయంత్రం 7.50 నుండి 8.25 గంటల మధ్య ప్రధాని బేగంపేట విమానాశ్రయం నుండి రాజ్‌భవన్‌కు వెళతారు. రాత్రి బస చేసిన అనంతరం బుధవారం ఉదయం 8.35 నుంచి 9.10 గంటల మధ్య మోదీ రాజ్‌భవన్ నుంచి రాజ్‌భవన్ నుంచి విమానాశ్రయం చేరుకుంటారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజలు తమ రూట్ ప్లాన్ చేసుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అభ్యర్థించారు.
