కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న సస్పెండ్ అయ్యారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని పీసీసీ ఫిర్యాదులు వచ్చాయి.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న సస్పెండ్ అయ్యారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని పీసీసీ ఫిర్యాదులు వచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గతంలోనే క్రమశిక్షణ కమిటీ తీన్మార్‌ మల్లన్నకు నోటీసులు పంపించి వివరణ కోరింది. దీనిపై తీన్మార్‌ మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పోటీ చేసి గెలిచారు. అయితే గత కొంత కాలంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. బీసీ కులగణన నివేదికను తగలబెట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మరోవైపు అగ్రకులం వాళ్లు బీసీలను అణగదొక్కుతున్నారంటూ రెడ్డి సామాజికవర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తీన్మార్‌ మల్లన్న వైఖరిపై పలు ఫిర్యాదులు రావడంతో పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ehatv

ehatv

Next Story