ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న(teenmar Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న(teenmar Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి(Telangana) చిట్టచివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనంటూ(CM revanth reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అఖిలపక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సులో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఇక నుంచి తెలంగాణలో బీసీ రాజ్యంగా రాబోతుందని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనతో పాటు.. సమగ్ర కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వంతో చేయించే బాధ్యత తనేదనన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాహుల్‌ గాంధీ ఉద్దేశమని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. 2028లో జరిగే ఎన్నికల్లో బీసీ నాయకుడే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు తీన్మార్ మల్లన్న. ఉద్యోగాలు(JObs) భర్తీ చేస్తే ఈడబ్ల్యూఎస్‌తో(EWS) ప్రమాదం ఉందన్నారు. జనాభాలో మొత్తం ఓసీలు కేవలం 6.98 శాతం మాత్రమే ఉన్నారని.. ఈలెక్కన వారికి ఒకటి లేదా ఒకటిన్నరశాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాలని.. కానీ ఈడబ్ల్యూఎస్‌తో 10 శాతం దక్కుతుందని.. 9 శాతం బీసీ రిజర్వేషన్లను ఓసీలు ఎత్తుకుపోతున్నారన్నారు. తెలంగాణలో బాలసంతలకులం కంటే తక్కువ జనాభా ఉన్న వెలమలు 13 ఎమ్మెల్యేలు అయ్యారని.. కానీ బాలసంతలకు అసెంబ్లీ ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యేలు కాలేదన్నారు.

Eha Tv

Eha Tv

Next Story