ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‏యస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌కు (ED Assistant Director Joginder) కవిత ఓ ఘాటైన లేఖ రాశారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‏యస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌కు (ED Assistant Director Joginder) కవిత ఓ ఘాటైన లేఖ రాశారు. ఇప్పటి వరకు తాను ఉపయోగించిన మొబైల్‌ ఫోన్లను ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో తీసుకునివెళ్లారు కవిత. మద్యం కేసు నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ఫోన్లను ధ్వసం చేశారని ఈడీ పదే పదే చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌ ఇవ్వడానికే కవిత ఫోన్లను తీసుకెళ్లారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడానికి ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని కవిత తెలిపారు.

Updated On 21 March 2023 6:18 AM GMT
Ehatv

Ehatv

Next Story