MLC Kavitha Tour To Australia : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత
ఆస్ట్రేలియా(Australia),(New Zealand) లలో జరగనున్న బోనాలు పండుగలో(Bonalu Festival) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్(Brice Bane) నగరంలో "భారత జాగృతి ఆస్ట్రేలియా" ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి.

MLC Kavitha
ఆస్ట్రేలియా(Australia),(New Zealand) లలో జరగనున్న బోనాలు పండుగలో(Bonalu Festival) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్(Brice Bane) నగరంలో "భారత జాగృతి ఆస్ట్రేలియా" ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకలకు ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.
అలాగే జులై 16న న్యూజిలాండ్(New Zealand) లోని ఆక్లాండ్(Auckland) నగరంలో జరగనున్న బోనాలు వేడుకలో కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్(New Zealand Central Assosiation) ఆధ్వర్యంలో జరగనున్న ఈ బోనాలు వేడుకలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఆక్లాండ్ లోని గణేష్ టెంపుల్ లో ఉదయం 11కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంతకుముందు ఉదయం 9 గంటలకు వివిధ రాష్ట్రాల ఎన్నారైలు ఆక్లాండ్ లో ఏర్పాటు చేయనున్న ప్రవాస భారతీయ సమ్మేళనం లో పాల్గొంటారు.
