మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎర్రవల్లిలోని తననివాసంలో గురువారం రాత్రి బాత్ రూంలో కాలుజారిపడటంతో ఎడమకాలితుంటి ఎముక ప్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

MLC Kavitha
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎర్రవల్లిలోని తననివాసంలో గురువారం రాత్రి బాత్ రూంలో కాలుజారిపడటంతో ఎడమకాలితుంటి ఎముక ప్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
కేసీఆర్ గాయం విషయం తెలిసిన ప్రధాని మోదీ.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిలషించారు. ఈ మేరకు ప్రధాని మోదీ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత బదులిస్తూ.. ధన్యవాదాలు తెలిపారు.
Thank you, Hon’ble Prime Minister Garu. https://t.co/oNHUCViaOT
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2023
