ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌కు కవిత ఓ ఘాటైన లేఖ రాశారు. ఇప్పటి వరకు తాను ఉపయోగించిన మొబైల్‌ ఫోన్లను ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో తీసుకునివెళ్లారు కవిత.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు(Delhi Liquor Scame Case )లో ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌కు కవిత ఓ ఘాటైన లేఖ రాశారు. ఇప్పటి వరకు తాను ఉపయోగించిన మొబైల్‌ ఫోన్లను ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో తీసుకునివెళ్లారు కవిత. మద్యం కేసు నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఫోన్లను ధ్వసం చేశారని ఈడీ పదే పదే చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌ ఇవ్వడానికే కవిత ఫోన్లను తీసుకెళ్లారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడానికి ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని కవిత తెలిపారు. ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ? అని కవిత లేఖలో ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ తాను మొబైల్‌ ఫోన్ల(Mobile Phones)ను ధ్వంసం చేశానని పేర్కొందని, తనను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది అంటూ కవిత నిలదీశారు. తనను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ (ED Investigation) పిలిచిందని, కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనని కవిత వివరించారు. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును తమ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని కవిత తెలిపారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని కవిత పేర్కొన్నారు.

Updated On 21 March 2023 1:47 AM GMT
Ehatv

Ehatv

Next Story