రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉచిత విద్యుత్(Free Current) వ్యాఖ్య‌ల‌పై తీవ్రదుమారం రేగుతుంది. ఈ విష‌య‌మై బీఆర్ఎస్(BRS) తీవ్ర‌స్థాయిలో కాంగ్రెస్‌పై మండిప‌డుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఈ విష‌య‌మై స్పందిస్తూ.. తెలంగాణ రైతాంగంపై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఉచిత విద్యుత్(Free Current) వ్యాఖ్య‌ల‌పై తీవ్రదుమారం రేగుతుంది. ఈ విష‌య‌మై బీఆర్ఎస్(BRS) తీవ్ర‌స్థాయిలో కాంగ్రెస్‌పై మండిప‌డుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఈ విష‌య‌మై స్పందిస్తూ.. తెలంగాణ రైతాంగంపై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) ప్రశ్నించారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో ట్వీట్(tweet) చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తే కాంగ్రెస్ కి వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. "కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందులపాలు చేయాలనుకుంటున్నారా @రాహుల్ గాంధీ.? అని అడిగారు. బీఆర్ఎస్ (BRS)పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని కవిత స్పష్టం చేశారు.

కాంగ్రెస్(congress) అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తుంది? ప్ర‌స్తుత బీఆర్ఎస్ స‌ర్కార్ అమ‌లుచేస్తున్న నిరంతరాయ కరెంట్ ను కొనసాగిస్తారా? అని అమెరికాలో ఎన్ఆర్ఐ ప్ర‌తినిధుల స‌మావేశంలో అడిగిన ప్ర‌శ్న‌కు రేవంత్ బ‌దులిస్తూ.. తెలంగాణలో 95 శాతం మంది 3 ఎకరాలలోపు ఉన్న చిన్న‌, స‌న్న కారు రైతులు మాత్రమే ఉన్నారని.. వారికి 3 గంటల కరెంట్(Current) ఉంటే సరిపోతుందన్నారు. టోట‌ల్‌గా రైతుల‌కు 8 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుంది అన్నారు. ఉచిత‌ విద్యుత్ పథకంతో కేసీఆర్ రైతుల‌ను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్ల కోసమే ఉచిత కరెంట్ పథకాన్ని వాడుకుంటున్నారని రేవంత్ అన్నారు. ఉచితాన్ని అనుచితంగా వాడుకోవ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పై మండిప‌డుతోంది.

Updated On 12 July 2023 1:54 AM GMT
Ehatv

Ehatv

Next Story