ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు సీబీఐ సిద్ధమైందా? రేపో మాపో కవితను ఈడీ విచారణకు పిలవనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాన్ని పంపుతున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు సీబీఐ సిద్ధమైందా? రేపో మాపో కవితను ఈడీ విచారణకు పిలవనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాన్ని పంపుతున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఈ స్కాంలో సోమవారం అరెస్టయిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. రామచంద్ర పిళ్లై కవిత బినామి అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్ మెంట్లు ఇచ్చినట్టు రిపోర్టు పేర్కొంది. కవిత ఆదేశాల మేరకే ఆయన పని చేసినట్టు రిపోర్టులో చెప్పింది. ఇండో స్పిరిట్ స్థాపనలో రామచంద్ర పిళ్లై దే కీలక పాత్ర అని రిపోర్టులో తెలిపింది.

కాగితాలపై రూ.3.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పిళ్లై చూపారని రిమాండ్ రిపోర్టులో ఉంది. అందుకు ప్రతిఫలంగా కవిత ఆదేశాల మేరకు అరుణ్ పిళ్లైకు కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలిపింది. నేరపూరిత నగదు ప్రవాహం గురించి తెలుసుకునేందుకు ఆయనను ఇంటరాగేషన్ చేయాలని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి రూ.వందల కోట్లు ఆప్ లీడర్లకు చెల్లించినట్లు పిళ్లై చెప్పారని సీబీఐ తెలిసింది.

అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ చేసిన ఈడీ రెండు రోజులపాటు ప్రశ్నించింది. అనంతరం హవాలా నిరోధక చట్టం కింద అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వారి సంఖ్య 11కి చేరింది. ఈడీ కస్టడీలో ఉన్న రామచంద్ర పిళ్లై స్టేట్ మెంట్ ను వీడియో రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది.

రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్ పీ సంస్థలతో పిళ్లై ఆర్థిక లావాదేవీలు జరిపారని... దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆ సంస్థల చిరునామాలు పరిశీలించగా... అవి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల పేరిట ఉన్నట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థల తర్వాతి టార్గెట్ ఎమ్మెల్సీ కవితేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Updated On 8 March 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story