తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) నాయకత్వంలో తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటుతున్నాయి. తెలంగాణలో అమలు అవుతున్న కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తెలంగాణ స్థితిగతులను మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై డెవలప్మెంట్‌ ఎకనామిక్స్‌(Development Economics) అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాసం చేయాల్సిందిగా బీఆర్‌ఎస్‌కు(BRS) చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavith) ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ(Oxford University) ఆహ్వానం పలికింది.

పదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాన్ని ఆకర్షించాయి. ఇటీవల బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్‌లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కవిత భేటీ అయ్యారు. దాంతో తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై ప్రసంగించాల్సిందిగా కోరుతూ కవితకు యూనివర్సిటీ ఆహ్వానం పంపింది. ఈ ప్రసంగం ఈ నెల 30వ తేదీన ఉంటుంది.

ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం(Agriculture) పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగిస్తారు. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు.

మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీళ్లును సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. వైద్య, విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పన పై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. ఒక్కొక్క పథకం అమలు వెనక ఎంత ప్రయోజనం ఉందో చెప్పడమే కాకుండా సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపమే తెలంగాణ అభివృద్ధి అని అంతర్జాతీయ వేదికపై కవిత చాటి చెప్పనున్నారు.

Updated On 24 Oct 2023 2:44 AM GMT
Ehatv

Ehatv

Next Story