మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీసు కిష్టయ్య కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు.

మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీసు కిష్టయ్య కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య పద్మావతి, కుమారుడు రాహుల్ ను కవిత కలిశారు. వారిని కలుసుకున్న సందర్భంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గతంలో తమ కూతురు ప్రియాంక వైద్య విద్య అభ్యసించడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన విషయాన్ని పద్మావతి గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే తరహాలో భవిష్యత్తులోనూ బీఆర్‌ఎస్ పార్టీ పోలీసు కిష్టయ్య కుటుంబానికి దన్నుగా ఉంటుందని కవిత మాట ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారని ఆమె అన్నారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
