తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో బిజెపి అవలంబిస్తున్న విధానాలు అప్రాజస్వామికంగా ఉన్నాయన్నారు. గత రెండు ఎన్నికల సందర్భాలలో మోడి ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. భారత జాగృతి ఆధ్వర్యంలో మొదటి కార్యక్రమం ఈనెల 10 న […]

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో బిజెపి అవలంబిస్తున్న విధానాలు అప్రాజస్వామికంగా ఉన్నాయన్నారు. గత రెండు ఎన్నికల సందర్భాలలో మోడి ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని ఆమె పేర్కొన్నారు.

ఇప్పటికైనా మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. భారత జాగృతి ఆధ్వర్యంలో మొదటి కార్యక్రమం ఈనెల 10 న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. సంపూర్ణ మెజారిటీతో ఉన్న బిజెపి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకురావాలని కోరారు. దీంతో పాటు బీసీ గణన చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ కి వ్యతిరేకంగా మరిన్ని నిరసన కార్యక్రమాలు చేస్తామని ఆమె చెప్పారు.

Updated On 4 March 2023 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story