బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని కొనియాడారు.

MLC Jeevan Reddy Fire on BRS Leaders
బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని కొనియాడారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్ మా రేవంత్ అని.. ఎవరెవరు ఒక్కటైనా రేవంత్ ని ఏం చేయలేరన్నారు. కేసీఅర్ అవినీతిని ప్రోత్సహించిందే బీజేపీ అన్నారు. అనుమతుల్లేని ప్రాజెక్టులకు కేంద్రం అప్పు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చన్నారు. మోదీకి మోకరిల్లింది అయ్యా, కొడుకులేనన్నారు.
రేవంత్ మొగోడు.. కృష్ణా జలాలను కేసీఆర్ తన మిత్రుడు జగన్ కి తాకట్టు పెట్టాడని ఆరోపించారు. నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆరే, వాటికి ఆటంకాలు తెచ్చింది కేసీఆరేనన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది కేసీఆర్.. తెలంగాణకి ఏం కావాలని ప్రధాని అడిగితే.. హామ్ కు కుచ్ నహీ చాహియే అని కేసీఆర్ అన్నారని అన్నారు. తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి సహకరించమని కోరినప్పుడు ఆత్మ గౌరవం ఏమయ్యిందని ప్రశ్నించారు.
కేసీఆర్ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు మోదీతో కేసీఆర్ సఖ్యతగా ఉన్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కేసీఆర్ తేవడంలో విఫలం అయ్యారని అన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడేవాళ్ళు కూడా ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల కలను రేవంత్ తీరుస్తున్నారని అన్నారు. వైట్ రేషన్ కార్డు ఉండి.. 200 యూనిట్లకు మించినా ఉచిత కరెంట్ ఇస్తామన్నారు.
