కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్ ను తలపిస్తున్నాయని.. ఆ దర్బార్ మాటలు వినివిని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిన సిగ్గు రావడం లేదని

కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్ ను తలపిస్తున్నాయని.. ఆ దర్బార్ మాటలు వినివిని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిన సిగ్గు రావడం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని కేసీఆర్ పెంచి పోషించారని ఆరోపించారు. ఆ సైన్యంతోనే ఫోన్లు ట్యాపింగ్ చేయించారని.. ఆ సైన్యమే ఒక్కొక్కటి బయట పెడుతున్నా.. కేటీఆర్ ఇంకా ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని అన్నారు.

పోన్ ట్యాపింగ్ వల్ల సభ్య సమాజం సిగ్గు పడుతోందన్నారు. లీగల్ నోటీసులు ఇస్తానని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ చెబుతున్నాడు.. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు.? కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా.? తెలంగాణ ఉద్యమకంటే ముందు మీ ఆస్తులు ఎన్ని.. ప్రస్తుత ఆస్తులు ఎన్ని? కేటీఆర్ లీగల్ గా ఫైట్ చేద్దామా? అని ప్ర‌శ్నించారు. అమెరికా నుండి ఇండియాకొచ్చినప్పుడు కేటీఆర్ ఆస్తులు ఎన్ని..? సవాల్ ను స్వీకరిస్తవా? చర్చకు సిద్ధమా కేటీఆర్ అంటూ స‌వాల్ విసిరారు. టెలిగ్రాఫ్ ఆక్ట్ ప్రకారం ట్యాపింగ్ చేయడం దేశ ద్రోహం.. మీ ప్రవర్తనల వల్ల రాష్ట్ర పరువు పోయింది.. కేటీఆర్ మీకు పరువుందా.? పరువు నష్ట దావా వేసే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు.

Updated On 2 April 2024 5:33 AM GMT
Yagnik

Yagnik

Next Story