తెలంగాణలో(Telangana) కేసీఆర్(KCR) ఆనవాళ్లు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చెప్పడం బాగానే ఉంది కానీ అసలు తెలంగాణ ఆనవాళ్లే లేకుండా చేయాలనుకోవడం మంచిది కాదు.
తెలంగాణలో(Telangana) కేసీఆర్(KCR) ఆనవాళ్లు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చెప్పడం బాగానే ఉంది కానీ అసలు తెలంగాణ ఆనవాళ్లే లేకుండా చేయాలనుకోవడం మంచిది కాదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెకిలించి వేయడం కూడా తెలంగాణకు శ్రేయస్కరం కాదు. పాలకుర్తి(Palakurthi) నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం(Kamareddy Gudem) ఎస్సీ కాలనీలో(SC Colony) ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఇదే దుస్థితి వచ్చింది. బీఆర్‌ఎస్(BRS) మండల కార్యదర్శి చింత రవి(chinta Ravi) ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Idol) ఏర్పాటు చేశారు. ఇది కాంగ్రెస్ నాయకులకు నచ్చలేదు. వెంటనే ఎమ్మెల్యే ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అనుమతి లేదనే సాకు చెప్పి విగ్రహాన్ని కూల్చివేతకు నడుం బిగించారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి(Yashaswini Reddy), ఆమె అత్త, నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డి(Jhansi Reddy), మండల అధికారులందరూ కలిసి పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అయితే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అడుగు భాగాన్ని పెకిలించడానికి పంచాయితీ సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహంతో రాజకీయాలు చేస్తానంటే కుదరదని, కూల్చివేత ఆపకపోతే పరిణామాలు మరో రకంగా ఉంటాయని చెప్పడంతో అధికారులు వెనక్కు తగ్గారు.