మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రోద్బలంతో నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఐజీపీకి ఫిర్యాదు చేశానని అచ్చంపేట్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ తెలిపారు

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రోద్బలంతో నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఐజీపీకి ఫిర్యాదు చేశానని అచ్చంపేట్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన అందరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయ‌ని.. ట్యాపింగ్ లో 30 మంది అధికారులు బీఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు వాడాల్సిన టాపింగ్, సోషల్ ఎలిమెంట్స్ కు వాడారన్నారు. వెంటనే విచారణ చేసి దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతాన‌న్నారు.

Updated On 28 May 2024 11:11 PM GMT
Yagnik

Yagnik

Next Story