బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) ఆసక్తికర ట్వీట్(Tweet) చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఓటమిపై గత నెల రోజులుగా వివిధ రకాల ఫీడ్ బ్యాక్‌(Feedback) మాకు వస్తుంది. వీటన్నింటినీ పరిశీలిస్తున్నాం. మాకు వచ్చిన ఫీడ్ బ్యాంక్‌లో ఆసక్తికరమైన అభిప్రాయం ఒకటి వచ్చిందని ఆయన చెప్పారు. అదేంటో కేటీఆర్‌ ట్వీట్‌లో చూద్దాం

'ఎన్నికల ఫలితాల తర్వాత చాలా విశ్లేషణలు మాకు అందుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎన్నో అంశాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇందులో ముఖ్యమైందేంటంటే.. 'కేసీఆర్‌(KCR) జిల్లాకో మెడికల్‌ కాలేజ్(Medical College) చొప్పున 32 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేయడం కన్నా.. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు 32 యూట్యూబ్ చానెళ్లను ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న సూచన ఆసక్తిగా ఉందని' ఆయన ట్వీట్ చేశారు. ఈ అభిప్రాయాన్ని కొంత వరకు అంగీకరించాల్సిందేనని కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు(Netizens) పలు విధాలుగా స్పందిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు.. ఇది వాస్తవవేనని అంటుంటే.. కొందరు మీరు ఇంకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా యూట్యూబ్ చానెళ్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

Updated On 31 Dec 2023 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story