తెలంగాణ(Telangana) జర్నలిస్టు ఫోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం తెలంగాణ పదాన్ని వుచ్చరించలేని సమయంలో, తెలంగాణ గళమెత్తిన అనేక మంది ఉద్యమకారులను సీమాంధ్ర ప్రభుత్వం పోలీసుల తో అణచిచేస్తున్న సమయంలో మా వేదిక తెలంగాణ జర్నలిస్ట్ ల ఫోరం అయింది. అప్పటికే కే సి ఆర్ గారి నాయకత్వంలో టీ ఆర్ ఎస్ కూడా మొదలై వుండటం మాకు కొంత బలాన్నినిచ్చింది. "తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్" లు అనే సింగిల్ స్లోగన్(Slogan) తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు అందరితో కలిసి వున్నదిని ఇంకా చెప్పాలంటే అందరికంటే ముందు వున్నది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్.

తెలంగాణ(Telangana) జర్నలిస్టు ఫోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం తెలంగాణ పదాన్ని వుచ్చరించలేని సమయంలో, తెలంగాణ గళమెత్తిన అనేక మంది ఉద్యమకారులను సీమాంధ్ర ప్రభుత్వం పోలీసుల తో అణచిచేస్తున్న సమయంలో మా వేదిక తెలంగాణ జర్నలిస్ట్ ల ఫోరం అయింది. అప్పటికే కే సి ఆర్ గారి నాయకత్వంలో టీ ఆర్ ఎస్ కూడా మొదలై వుండటం మాకు కొంత బలాన్నినిచ్చింది. "తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్" లు అనే సింగిల్ స్లోగన్(Slogan) తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు అందరితో కలిసి వున్నదిని ఇంకా చెప్పాలంటే అందరికంటే ముందు వున్నది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్. ఒస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లాన్స్ లో ఎన్నో చర్చల తర్వాత ఇలా మొదలైతే మన ఉద్యోగాలు వూడతాయి అని తెలిసి కూడా 2001 మే 31 న తేదీన ఐదు ఆరుగురం నిర్ణయం తీసుకుని మొదలుపెట్టాం. అలాంటి పరిస్థితి నుంచి జర్నలిస్ట్ ఫోరం ఒక్క మెసేజ్ పెడితే చాలు గంటలో వంద మంది జర్నలిస్టులు జమ అయ్యే పరిస్థితి దాకా తీసుకొచ్చాం. చాలా విషయాలు బయటకు చెప్పలేము కానీ జర్నలిస్ట్ ఫోరమ్ ప్రతినిధులుగా మేము చేయని పనిలేదు. ఒక వైపు ఉద్యోగం ఇంకో వైపు ఉద్యమం. ఆఫీస్ లో మీటింగ్ అయిపొంగనే ఏదో ప్లేస్ లో అల్లం సార్ నేను రవి రమనన్న పి వి లతో పాటు యంగ్ తెలంగాణ జర్నలిస్ట్ బ్యాచ్ తో మా మీటింగ్. ఇలా ఈ రోజు ఏం చేయాలి ఎవరినీ కలవాలి ఫలానా నాయకుడు ఎందుకు జై తెలంగాణ అంటలేదు అనిపిద్ధాం చలో అంటూ సదరు వ్యక్తి దగ్గర వాలడం ఆయనతో జై తెలంగాణ అనిపించడం ఆయనతోనే ఒక మీటింగ్ పెట్టించి వాళ్ళ పార్టీ మీద వొత్తిడి తెప్పించడం. ఇంకో పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి ఆయనతో ముచ్చట్లు ఇలా ఒక కాలెండర్ వేసుకున్నట్టు పనిచేసిన దినాలు తీపి గుర్తులు. అవును ఆరోజుల్లో ఆఫీస్లల్లో హేళన కు గురయ్యాo, వివక్షకు గురయ్యాము, అవమానాలు ఎదుర్కునే చోట అవమానాలు పడ్డం. అవమానించినొన్ని తన్నాలనుకున్నప్పుడు తన్నాల్సిన చోటతన్నాం. తెర మీద కొందరం మాత్రమే కనిపించే వాళ్ళం కానీ కనిపించని జర్నలిస్ట్ మిత్రులు వేలకొలది. అందుకే అంత సక్సెస్ఫుల్ గా జర్నలిస్ట్ ఫోరమ్ నడిచింది. నేను ముందే చెప్పినట్టు జర్నలిస్ట్ ల ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ కోసమే జర్నలిస్ట్ లు అనే ట్యాగ్ తోనే పనిచేశాం. సాకారం అయిన తెలంగాణ లో తెలంగాణ ప్రజల మౌలిక జీవన విధానాల్లో మార్పు వచ్చింది అనేది సత్యం. మన నిధులు మనకే దక్కుతున్నాయి అనడం యదార్థం, మన ఉద్యోగాలు మనకే దక్కుతున్నాయి అనేది వాస్తవం. మన నీల్లు మనకే చెందుతున్నాయి అనేది పచ్చి నిజం. ఎమ్మెల్యే అయినందున ఇట్లా చెబుతున్నాడు అని విమర్శించే వాల్లున్న నేను ఇదే చెబుతా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తదుపరి కార్యాచరణ గురించి అన్ని జిల్లాల నుంచి హాజరైన ముఖ్యులతో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం లో చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ప్రత్యేక రాష్ట్రం సాధించాం కనుక భవిష్యత్తు లో తెలంగాణలో అద్భుతమైన పాలన జరగాలి ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అన్ కండిషనల్ గా రెండు లేదా మూడు పర్యాయాలు మనం సపోర్ట్ గా వుండాలని నిర్ణయించి, జర్నలిస్టు ఫోరం లక్ష్యం నెరవేరింది ఇక మనం జర్నలిస్ట్ ల ప్రయోజనాల కోసం పాటుపడుదాం అని తీర్మానం చేసి TUWJ గా మార్చెద్ధాం అని నిర్ణయించాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ సభ పెట్టి అన్ని పార్టీల నాయకులను పిలిచి గౌరవించు కావాలని అనుకున్నాం. కే సి ఆర్ గారిని జానారెడ్డి గారిని గద్దర్ అన్న ను కోదండరాం సార్ ను ఆనాటి ఎం పి లు అందరినీ సి పి ఐ , సి పి ఎం, బి జె పి తో సహా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతినొక్కరిని పిలిచాం. అయితే దీనికి ముఖ్య అతిథిగా పిలవడానికి నేను అల్లం సార్, నేను,పి వి శ్రీనివాస్ రవి తో పాటు ఇంకొందరం వెళ్ళాము. విషయం చెప్పిన తర్వాత కే సి ఆర్ గారు ఒకే మాట చెప్పారు మీరు జర్నలిస్ట్ ఫోరాన్ని అలాగే ఉంచండి రేపు భవిష్యత్తు లో అనేక శక్తులు తెలంగాణ అభిృద్ధి నీ అడ్డుకుంటాయి అలాంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్ ఫోరం పాత్ర కీలకం గా వుండబోతుంది అని సలహా ఇచ్చారు. అయితే అప్పటికే ఒక నిర్ణయం అయిపోయింది ఫోరమ్ వుంటుంది యూనియన్ కూడా వుంటుంది అని చెప్పి సార్ నీ ఆహ్వానించి మేము వచ్చేశాం. ఇప్పుడు నేను అల్లం సార్ బయట వున్నప్పటికీ జర్నలిస్ట్ ఫోరం ఎప్పటికీ సజీవంగా వుంటది. దానికి ఒక పునాది వున్నది. కొంధరం బయటకొచ్చిన అవసరం వచ్చినప్పుడు దాని పాత్ర అది పోషిస్తుంది. తెలంగాణ జర్నలిస్ట్ లకు దీర్ఘ కాలిక కార్యాచరణ వుంటుంది అని ఫోరమ్ నిరూపించింది.
జై తెలంగాణ
క్రాంతి కిరణ్(Kranthi kian)
టి జే ఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి

Updated On 31 May 2023 8:41 PM GMT
Ehatv

Ehatv

Next Story