గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలో(Suryapet) ఆయన మీడియాతో మాట్లాడుతూ..

MLA Jagadish Reddy
గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలో(Suryapet) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) దరఖాస్తుల పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోందన్నారు. దరఖాస్తులు లేకుండా.. దళారి వ్యవస్థ లేకుండా తాము ఆన్ లైన్ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేశామన్నారు. ప్రజలు పథకాలు అడుగుతున్నారు.. పత్రాలు కాదని అన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక కాంగ్రెస్ నాయకులు కూడా అయోమయానికి గురవుతున్నారని అన్నారు. ఇష్టారీతిన హామీలు ఇచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయన్న ఆయన.. ఈ పత్రాల డ్రామాలు ఎంతోకాలం సాగవని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ మోసాన్ని గుర్తిస్తున్నారని.. హామీలు అమలు చేయకుంటే వెంటపడి తరుముతారని హెచ్చరించారు
