బతుకమ్మ పండుగ(Bathukamma festival) కళ తప్పిందన్నది చాలా మంది మాట!
బతుకమ్మ పండుగ(Bathukamma festival) కళ తప్పిందన్నది చాలా మంది మాట! ఇందుకు కారణం బతుకమ్మ ఏర్పాట్లలో ప్రభుత్వం(Government) నిర్లక్ష్యం వహించడం! నిర్లక్ష్యం కాదు, వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సూర్యాపేటలో(Suryapet) అయితే అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. బతుకమ్మను సాగనంపే ఏర్పాట్లలో అధికారులు ఎందుకో అంత శ్రద్ధ చూపలేదు. వందలాదిగా బతుకమ్మలతో నిలిచి ఉన్న ఆడపడచులను చూసి ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి చలించిపోయారు. ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. తన ఇంటి బతుకమ్మ నిమజ్జనం చేసి తిరిగి వెళుతున్న జగదీష్ రెడ్డికి ఏర్పాట్లు సరిగ్గా లేక చేతిలో బతుకమ్మలు పట్టుకుని మహిళలు నిలిచిన దృశ్యం కంటపడడంతో తనతో పాటు ఉన్న మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, లీడర్లతో కలిసి వందలాది బతుకమ్మలను స్వయంగా గంగమ్మ ఒడిలోకి చేర్చారు. స్వయంగా మాజీ మంత్రే ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఆశ్చర్యపోయిన ఆడపడచులు మొహమాటంతో తటపటాయించారు. పర్వాలేదు అంటూ తానే బతుకమ్మలను తీసుకుని నిమర్జనం చేశారు జగదీశ్ రెడ్డి. మరోవైపు ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో మహిళలు ఆగ్రహాన్ని, ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.