రుణమాఫీకి ఇచ్చిన డబ్బులకంటే ఫ్లెక్సీలు, ప్రచారాలు, పాలాభిషేకాలకే ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు తేలిపోయాయన్నారు.

రుణమాఫీకి ఇచ్చిన డబ్బులకంటే ఫ్లెక్సీలు, ప్రచారాలు, పాలాభిషేకాలకే ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు తేలిపోయాయన్నారు. ఎంతో ఆర్భాటం గా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం నవ్వుల పాలయిందన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచకపోగా తగ్గించారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి దారుణంగా తయారయ్యిందని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని, కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్త అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, సాగు, తాగు నీరు అందించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న యాసంగికి ఉద్దేశపూర్వకంగానే నీళ్లు ఇవ్వలేదని, కావాలనే ఎగ్గొట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ పని అయిపోయిందని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. నీళ్లిచ్చే అవకాశం ఉన్నా రైతులపట్ల కక్ష పురితంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంతో ఈ సమయానికి కేసీఆర్‌ నీళ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి కాళేశ్వరం బటన్ నొక్కి నీటిని పంపింగ్ చెయ్యాలని డిమాండ్‌ చేశారు.రుణమాఫీ కంటే ప్రచారానికే ఎక్కువ సొమ్ము : జగదీశ్‌రెడ్డి

Eha Tv

Eha Tv

Next Story