ఉమ్మడి నల్లగొండ లోని నల్లగొండ, భువనగిరి రెండు లోక్ సభ స్థానాల్లో ఎగిరెది గులాబి జెండా నే అనీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఉమ్మడి నల్లగొండ లోని నల్లగొండ, భువనగిరి రెండు లోక్ సభ స్థానాల్లో ఎగిరెది గులాబి జెండా నే అనీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం పాచ్యా నాయక్ తండా లో నల్లగొండ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి కి మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి గడప గడప కు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. ప్రచారంలో బిఆర్ఎస్ శ్రేణులకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని నల్లగొండ, భువనగిరిలో బిఆర్ఎస్ అభ్యర్ధుల విజయం తథ్యం అన్నారు.

ప్రచారానికి వెళ్లిన తమ నాయకులను కలుస్తున్న సబ్బండ వర్గాలు కాంగ్రెస్, బిజేపీ వైఫల్యాలను ఎండగడుతున్న వైనమే దీనికి నిదర్శనం అన్నారు. కేసీఆర్‌ను వదులుకొని తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు మోసపోయని, కల్యాణ లక్ష్మీ పధకం ద్వారా లక్ష రూపాయల కు తోడు తులం బంగారం, రైతు రుణ మాఫీ, వంటి మోసపూరిత వాగ్దానాలకు మోసపోయామని ప్రజలు వాపోతున్నారనీ అవేదన వ్యక్తం చేశారు. కొత్త పథకాలు ఇవ్వక పోగా.. కేసీఆర్ ఇచ్చినవి కొనసాగించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు పక్కన పెట్టి ప్రజలకు సంబంధం లేని అంశాలతో కాంగ్రెస్ బిజెపి నాటకాలు ఆడుతున్నాయని, కాంగ్రెస్ బిజెపి నాటకాలను తెలంగాణ ప్రజలు పసిగట్టారని అన్నారు. పాలేందో ..నీళ్ళేందో ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. మరోసారి కాంగ్రెస్‌ నమ్మితే మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించిన హస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అన్న జగదీష్ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ హయాంలో పథకాలు అందని ఇల్లు లేదన్నారు.

Updated On 1 May 2024 4:07 AM GMT
Yagnik

Yagnik

Next Story