కేసీఆర్(KCR) కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలను కొంటారని ఈ బ్రహ్మ జ్ఞాని బండి సంజయ్(Bandi Sanjay) సెలవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని(BJP) హరీష్‌రావు(Harish Rao) అన్నారు. పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదేనని హరీష్‌రావు అన్నారు. మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టారన్న ఆయన.. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా బండి సంజయ్‌ తీరు ఉందని హరీష్‌రావు విమర్శించారు.

కేసీఆర్(KCR) కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలను కొంటారని ఈ బ్రహ్మ జ్ఞాని బండి సంజయ్(Bandi Sanjay) సెలవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని(BJP) హరీష్‌రావు(Harish Rao) అన్నారు. పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదేనని హరీష్‌రావు అన్నారు. మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టారన్న ఆయన.. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా బండి సంజయ్‌ తీరు ఉందని హరీష్‌రావు విమర్శించారు. లొట్ట పిట్ట మాదిరి ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు బండి సంజయ్‌ ప్రయత్నిస్తుంటాడని హరీష్‌రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.
కరీంనగర్‌కు(Karimnagar) ఒక్క రూపాయి తెనోడు అడ్డం పొడువు మాట్లాడుతున్నాడని బండి సంజయ్‌పై విమర్శలు చేశారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమీక్షలో మంత్రి హరీష్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

అప్పులంటూ, శ్వేతపత్రాలంటూ ప్రభుత్వం కవ్వింపులకు పాల్పడుతోందన్న హరీష్‌రావు.. ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతోందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలని ఆయన అన్నారు.
మన బడ్జెటే 2 లక్షల 90 వేల కోట్లని.. ఎక్కడి నుంచి నిధులు తెస్తారని హరీష్‌రావు ప్రశ్నించారు. 5 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని కర్ణాటక ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి మొన్న మీడియాతో చెప్పారని హరీష్‌రావు అన్నారు. మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారెంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన అన్నారు. 100 రోజుల సమయం కానందున ఏమీ మాట్లాడట్లేదని.. 100 రోజులు దాటి ఉంటే కాంగ్రెస్‌ను చీల్చిచెండాడేవాళ్లమన్ని హరీష్‌రావు అన్నారు. దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్(Utham Kumar Reddy) అన్నారు. ఇప్పుడు ఏమంటారో ఉత్తమ్‌ చెప్పాలన్నారు.

Updated On 17 Jan 2024 7:09 AM GMT
Ehatv

Ehatv

Next Story