తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌(KCR) మళ్లీ ప్రజల్లోకి రానున్నారని తెలుస్తోంది. ఎన్నికల బీఆర్‌ఎస్(BRS) ఓడిన తర్వాత తన ఫాంహౌస్‌లోని(Farmhouse) వాష్‌రూమ్‌లో కింద పడడంతో కేసీఆర్‌ తుంటి ఎముక విరిగింది. తుంటి ఎముక ఆపరేషన్‌ విజయవంతమైన తర్వాత నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి సమయంలో పలువురు ముఖ్య నాయకులతో కేసీఆర్ మంతనాలు జరిపి ఓటమికి గల కారణాలను విశ్లేషించారని తెలిసింది.

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌(KCR) మళ్లీ ప్రజల్లోకి రానున్నారని తెలుస్తోంది. ఎన్నికల బీఆర్‌ఎస్(BRS) ఓడిన తర్వాత తన ఫాంహౌస్‌లోని(Farmhouse) వాష్‌రూమ్‌లో కింద పడడంతో కేసీఆర్‌ తుంటి ఎముక విరిగింది. తుంటి ఎముక ఆపరేషన్‌ విజయవంతమైన తర్వాత నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి సమయంలో పలువురు ముఖ్య నాయకులతో కేసీఆర్ మంతనాలు జరిపి ఓటమికి గల కారణాలను విశ్లేషించారని తెలిసింది. మరో నాలుగు వారాల్లో కేసీఆర్‌ కోలుకుంటారని కేటీఆర్‌(KTR), హరీష్‌రావు(Harish Rao) చెప్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ మానస పుత్రిక అయిన రైతుబంధును(rythu bandhu) ఈ ప్రభుత్వం సకాలంలో చెల్లించడంలేదని టీఆర్ఎస్ వర్గాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ప్రజలకు ఇచ్చిందని ఓ బుక్‌లెట్‌ను కూడా కేటీఆర్‌ విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకుండానే మాపై విమర్శలు చేస్తారా..? అని అధికార పక్ష నేతలు కూడా టీఆర్‌ఎస్ నాయకులపై ఎదురుదాడి చేస్తున్నారు.

అయితే ఈ యాసంగి సీజన్‌కు రైతుబంధు సాయం ఇంకా చేరలేదని పార్టీ కార్యకర్తలు, రైతులు చెప్తున్నారు. పంట పెట్టుబడికి రైతులు అప్పులు చేయాల్సిన అవసరం వస్తోందని రైతులు వాపోతున్నారు. రైతుబంధు పథకం అమలుపై క్షేత్రస్థాయిలో కేసీఆర్‌ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. తన మానస పుత్రిక రైతుబంధు అమలుకాకపోతే మాత్రం కేసీఆర్‌ కదనరంగంలోకి దూకుతారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణ భవన్‌లో(Telangana Bhavan) పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రోజుకో పార్లమెంట్ స్థానంపై ప్రతీ నియోజకవర్గం నుంచి వచ్చిన నేతలతో ఫీడ్ బ్యాక్‌ తీసుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల(MP Elections) ఎలా సిద్ధం కావాలో సన్నాహకాలు ప్రారంభించారు. ఈనెలాఖరు వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అందుబాటులో ఉంటారని.. కార్యకర్తలను ప్రతి రోజూ కలుసుకుంటారని అన్నారు. ఫిబ్రవరి తర్వాత జిల్లాల్లో ఆయన పర్యటనలు కూడా ఉంటాయని హరీష్‌రావు చెప్పారు. ఫిబ్రవరి తర్వాత కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన 100 రోజుల గడువు కూడా ముగియనుండడంతో కేసీఆర్‌ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కేసీఆర్‌ మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఆయన మౌనంగా ఉండడం వెనుక పెద్ద వ్యూహాలే ఉంటాయని ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. భవిష్యత్‌లో కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయోనని పార్టీ క్యాడర్‌ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Updated On 6 Jan 2024 7:28 AM
Ehatv

Ehatv

Next Story