కాంగ్రెస్(congress) ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం(women free bus) పథకంపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సిద్దిపేట(Siddipet) డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు.

MLA Harish Rao
కాంగ్రెస్(congress) ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం(women free bus) పథకంపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సిద్దిపేట(Siddipet) డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినప్పటికీ.. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల(Auto Drivers) జీవితాలను రోడ్డున పడేసిందన్నారు. ఏ ప్రభుత్వమైనా ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోకూడదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉందన్నారు. తమ పొట్ట కొట్టారంటూ ఆటో డ్రైవర్లు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని.. ఆటో కార్మికులకు ప్రతి నెల రూ.15వేలు భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
