మాజీమంత్రి, బీజేపీ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం బాటసింగారం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించాలని బీజేపీ నిర్ణయించించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పోరు బాట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.

MLA Etela Rajender house arrest
మాజీమంత్రి, బీజేపీ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajendar)ను పోలీసులు(Police) హౌస్ అరెస్ట్(House Arrest) చేశారు. గురువారం బాటసింగారం(Batasingaram) నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ(Double Bedroon Houses)ను పరిశీలించాలని బీజేపీ నిర్ణయించించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ(BJP) పోరు బాట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. బాటసింగారం వైపు ఎవరు రావద్దు.. ఎవరైనా వచ్చినట్లయితే ముందస్తు చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జంటనగరాల్లో ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్(Abdullapur Met) మండలంలో బీజేపీ నాయకులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్(LB Nagar) నియోజకవర్గంలో మన్సురాబాద్(Mansurabad), వనస్థలిపురం(Vanasthalipuram), హయత్ నగర్(Hayath Nagar), నాగోల్(Nagole), చైతన్య పూరి(Chaithanyapuri) కార్పొరేటర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
