లైఫ్‌బోయ్‌ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉన్నట్టు అధికారం ఎక్కడ ఉందో దానం నాగేందర్‌(Dhanam Nagender) అక్కడ ఉంటారు. అధికారం లేకుండా పాపం దానం నాగేందర్‌ వారం రోజులు కూడా ఉండలేరు. అది ఆయన నైజం. ఒడ్డున పడిన చేపలా గిలగిలాడిపోతారు. ఎప్పుడెప్పుడు అధికారపక్షంలోకి దూకేద్దామా అన్న ఆత్రుతతో ఉంటారు. దానం నాగేందర్‌కు సిద్ధాంతాలు గట్రాలు ఏమీ లేదు. అయినా ఇప్పుడున్న రాజకీయనాయకుల్లో ఎవరికి మాత్రం ఉంది లేండి? కాకపోతే దానం నాగేందర్‌ అంత స్పీడ్‌గా ఎవరూ ఇలాంటి సాహసం చేయరు

లైఫ్‌బోయ్‌ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉన్నట్టు అధికారం ఎక్కడ ఉందో దానం నాగేందర్‌(Dhanam Nagender) అక్కడ ఉంటారు. అధికారం లేకుండా పాపం దానం నాగేందర్‌ వారం రోజులు కూడా ఉండలేరు. అది ఆయన నైజం. ఒడ్డున పడిన చేపలా గిలగిలాడిపోతారు. ఎప్పుడెప్పుడు అధికారపక్షంలోకి దూకేద్దామా అన్న ఆత్రుతతో ఉంటారు. దానం నాగేందర్‌కు సిద్ధాంతాలు గట్రాలు ఏమీ లేదు. అయినా ఇప్పుడున్న రాజకీయనాయకుల్లో ఎవరికి మాత్రం ఉంది లేండి? కాకపోతే దానం నాగేందర్‌ అంత స్పీడ్‌గా ఎవరూ ఇలాంటి సాహసం చేయరు. తాను చేసిన తప్పిదాల నుంచి తప్పించుకోవడానికి అధికారపార్టీలో చేరతారా? లేకపోతే పార్టీలు మారడం ఆయన స్వభావమా? తెలంగాణ ఉద్యమం(Telangana Protest) తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆయన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌(congress) పార్టీలో ఉన్నారు. పైగా మంత్రి పదవిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం అణచి వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పాపం తెలంగాణ పిల్లలను లాఠీలతో కొట్టించారు. తెలంగాణ ఉద్యమ కారులను ఎన్నో విధాలుగా బాధపెట్టారు. ఇలాంటి పచ్చి తెలంగాణ వ్యతిరేకిని కేసీఆర్‌ ఎందుకు దగ్గరకు తీసుకున్నారో ఇప్పటికీ అర్థం కాని విషయం. టికెట్ ఇచ్చి మరీ గెల్పించుకున్నారు. ఆ రోజున దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోయారు. దానం నాగేందర్‌ ఏ ఎండకా గొడుకు పట్టే రకమని కేసీఆర్‌కు తెలియంది కాదు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పైనే దానం గెలిచారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి దానం కాంగ్రెస్‌లో చేరడానికి స్కెచ్చులు వేసుకున్నారు. వంద రోజుల్లోపే పార్టీ మారాలని డిసైడయ్యారు. అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే తన అక్రమ వ్యాపారాలు బయటపడకుండా ఉంటాయని దానం నాగేందర్‌లాంటి నేతలు భావిస్తుంటారు. అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని, ప్రజాసేవ కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పుకుంటున్న దానం ఆ ప్రజాసేవను ఎప్పుడు చేశారో కూడా చెబితే బాగుండేది. పంజాగుట్ట చౌరస్తా దగ్గర దివాంజీ బయట బీడీలు అమ్ముకుంటాడని రేవంత్‌రెడ్డితో పొగిడించుకున్న దానం నాగేందర్‌ ఇప్పుడు అదే రేవంత్‌తో కండువా వేయించుకున్నారు.

Updated On 18 March 2024 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story