అరాఫత్‌ తనతో చివరిసారిగా మార్చి 7న మాట్లాడాడని, అప్పటి నుంచి టచ్‌లో లేడని

మార్చి నెలలో తప్పిపోయిన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి US నగరం క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. హైదరాబాద్‌ విద్యార్థి అబ్దుల్‌ మహ్మద్‌ అరాఫత్‌ ను డ్రగ్స్‌ మాఫియా కిడ్నాప్‌ చేసింది. తమ కుమారుడిని కాపాడాలంటూ అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. అరాఫత్‌ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు ప్రయత్నించినప్పటికీ అవి సఫలమవ్వలేదు. హైదరాబాద్‌లోని నాచారంకు చెందిన అబ్దుల్‌ మహ్మద్‌ అరాఫత్‌ క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేసేందుకు గత ఏడాది మేలో అమెరికా చేరుకున్నాడు.

అరాఫత్‌ తనతో చివరిసారిగా మార్చి 7న మాట్లాడాడని, అప్పటి నుంచి టచ్‌లో లేడని అరాఫత్‌ తండ్రి మహ్మద్ సలీమ్ చెప్పాడు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. యుఎస్‌లోని అరాఫత్‌ రూమ్‌మేట్‌లు క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేసినట్లు అతని తండ్రికి తెలియజేశారు. మార్చి 19న, అరాఫత్‌ కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది. డ్రగ్స్ అమ్మే ముఠా కిడ్నాప్ చేసిందని.. విడుదల చేయడానికి USD 1,200 డిమాండ్ చేసింది. హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ ఖాతా ద్వారా ధృవీకరించింది. అరాఫత్‌ మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Updated On 8 April 2024 11:08 PM GMT
Yagnik

Yagnik

Next Story