గిరులు ఝరులు విరులు తరులు నేలా నింగీ సమస్తాన్ని ఆరాధించే తత్వం మనది! ఒక్కమాటలో చెప్పాలంటే మనం ప్రకృతి ఆరాధకులం! చెట్టును పూజించే గొప్ప సంప్రదాయం కూడా మనదే! ఈ విషయం తెలుసు కాబట్టే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి(Minister Vemula Prashanth Reddy) చెట్టుకు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఇందుకో కారణం కూడా ఉంది. సరిగ్గా ఎనిమిది సంవత్సరాల కిందట అంటే 2015 జులై 6వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)
గిరులు ఝరులు విరులు తరులు నేలా నింగీ సమస్తాన్ని ఆరాధించే తత్వం మనది! ఒక్కమాటలో చెప్పాలంటే మనం ప్రకృతి ఆరాధకులం! చెట్టును పూజించే గొప్ప సంప్రదాయం కూడా మనదే! ఈ విషయం తెలుసు కాబట్టే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి(Minister Vemula Prashanth Reddy) చెట్టుకు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఇందుకో కారణం కూడా ఉంది. సరిగ్గా ఎనిమిది సంవత్సరాల కిందట అంటే 2015 జులై 6వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) వేల్పూరు మండల కేంద్రంలో ఉన్న ప్రశాంత్‌రెడ్డి ఇంటి ఆవరణలో ఓ మొక్క నాటారు. అది దినదినప్రవర్ధమానమై చెట్టయ్యింది. ఎనిమిదేళ్ల పూర్తి చేసుకుని తొమ్మిదో ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రజలు, బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రశాంత్ రెడ్డి కేక్ కట్ చేశారు. చెట్టుకు పుట్టిన రోజును ఘనంగా జరిపారు. కేసీఆర్ చేపట్టిన హరితహారం చాలా గొప్పదని, ఓట్ల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదని, భవిష్యత్తు తరాలు బాగుండాలనే సదాశయంతోనే దీన్ని చేపట్టామని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో చాలా చోట్ల అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణ(Telangana)లో మాత్రం సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయన్నారు. మొక్కలు నాటితే సరిపోదని, వాటిని సంరక్షించడం బాధ్యతగా గుర్తించాలని చెప్పారు.