నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడాడు అనిపించిందని.. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమేన‌ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడాడు అనిపించిందని.. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమేన‌ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ డిప్రెషన్, ఫస్ట్రేషన్ లో ఉన్నాడని అన్నారు. ఓడిపోవడమే కాదు.. పార్టీ మిగలదు అనే భయం కేసీఆర్ లో మొదలైందన్నారు. పొంగనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారు.. ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలిపోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని జోష్యం చెప్పారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది అని కేసీఆర్ అబద్దం చెప్పారని అన్నారు.

భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ అని అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారమ‌న్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదన్నారు. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదని.. ఇరిగేషన్ పై మాట్లాడే అర్హత కేసీఆర్ కి లేదన్నారు. ప్రాజెక్టులను KRMBకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. కేసీఆర్, జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని అన్నారు. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకి ఎక్కువ ద్రోహం జరిగిందన్నారు. పోలీస్ శాఖను ఎక్కువ మిస్ యూజ్ చేసింది కేసీఆర్ అని అన్నారు. పోలీసులు న్యూట్రల్ గా ఉండాలి అని ఇప్పుడు కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కరువు వచ్చింది బీఆర్ఎస్ పాలనలోనే.. దాన్ని సమర్థవంతంగా డీల్ చేస్తున్నామ‌న్నారు.

Updated On 1 April 2024 2:34 AM GMT
Yagnik

Yagnik

Next Story