కేసీఆర్ కరీంనగర్ లో మాట్లాడిన ప్రతీ మాట అబద్దమేన‌ని.. ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కరీంనగర్ లో మాట్లాడిన ప్రతీ మాట అబద్దమేన‌ని.. ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లెక్క పాస్ పోర్ట్ లు అమ్మి, కాంట్రాక్టర్లకు బ్రోకర్ల లాగా పనిచేయలేద‌న్నారు. ఎవరినో తొక్కడం కాదు.. ఈ ఎన్నికల్లో జనం కేసీఆర్ ను బొంద పెడతారన్నారు. కేసీఆర్ ఫ్రస్టేషన్ లో వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇరిగేషన్ పై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ ఇంట్ల పన్నడని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పిచ్చిలేచినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్ సిగ్గు, శరం, లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. ఇవ్వాళ బ్రోకర్, జోకర్ వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్.. ఆనాడు సీఎంగా ఉండి మేడిగడ్డపై ఎందుకు నోరు విప్పలేదన్నారు. కేసీఆర్ లెక్క వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరి తీస్తారని అన్నారు. సూర్యాపేటకు సాగునీళ్ళు కాదు ఇచ్చింది.. తాగునీరు మాత్రమే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వదిలారని అన్నారు.

సూర్యాపేట, పాలేరుకు కేసీఆర్ మొకం చూసి నీళ్ళు ఇవ్వలేదు.. మా షెడ్యూల్ ప్రకారం ఇచ్చామ‌న్నారు. కేసీఆర్ అంతా పొగరుబోతు వ్యక్తిని నేను ఇంకొకరిని చూడలేదు. కేసీఆర్ కమిషన్ల కక్కుర్తి వల్లే అంబేద్క‌ర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టు గా మారిందన్నారు. కేసీఆర్ పొగరు వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న BRS.. 39 కి వచ్చారు.. ఇందులో 25 మంది కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. ఈ కరువు కేసీఆర్ తెచ్చింది మాత్రమే.. కాంగ్రెస్ తెచ్చింది కాదన్నారు. కేసీఆర్ మాటలు ప్రజలు నమొద్దు.. రాష్ట్రంలో పవర్, డ్రింకింగ్ వాటర్ సమస్య రాదన్నారు.

Updated On 6 April 2024 6:31 AM GMT
Yagnik

Yagnik

Next Story