మాజీ మంత్రి హరీష్ రావు విద్యుత్ మీటర్ల విషయంలో అబద్దాలు చెప్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Minister Uttam Kumar Reddy Fire on BRS Leaders
మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విద్యుత్ మీటర్ల విషయంలో అబద్దాలు చెప్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttamkumar Reddy) అన్నారు. అసెంబ్లీ శ్వేతపత్రం(White Paper)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీటర్ల విషయాల్లో బిల్లుల ప్రస్తావన లేదని.. నేను పార్లమెంట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నా.. ఆ విషయాలపై నాకు అవగాహన ఉందని వివరించారు. సివిల్ సప్లై శాఖలో నాలుగు సంవత్సరాలుగా ఆడిట్ లేదు.. 58 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్నారు.
ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం(Ration Rice) డైవర్ట్ అయ్యాయని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)పై గత ప్రభుత్వం విచారణ చేపట్టలేదని దుయ్యబట్టారు. అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టు లకు పగుళ్లు వచ్చాయి.. రిపేర్లు చేయాల్సిందేనని వివరించారు. ఎంతో గొప్పగా ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిరుపయోగంగా మారిపోయిందన్నారు.ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని.. అవినీతికి పాల్పడి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు.
