సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వ‌డం కక్ష సాధింపు చర్యలుగా చూస్తున్నామ‌ని రాష్ట్ర సాగునీరు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ..

సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వ‌డం కక్ష సాధింపు చర్యలుగా చూస్తున్నామ‌ని రాష్ట్ర సాగునీరు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐ లతో బెదిరించాలని చూస్తుందన్నారు. ఫేక్ వీడియో అంటూ నోటీసులు పంపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆ వీడియోలతో సంబంధం ఏమిటి అని ప్ర‌శ్నించారు. నోటీసులకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Updated On 29 April 2024 9:20 PM GMT
Yagnik

Yagnik

Next Story