మా కుటుంబం రామభక్తులమే అని, అయోద్య రామమందిరం నిర్మాణం పూర్తయ్యాక రాములవారిని దర్శించుకుంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
మా కుటుంబం రామభక్తులమే అని, అయోద్య రామమందిరం నిర్మాణం పూర్తయ్యాక రాములవారిని దర్శించుకుంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttamkumar Reddy) అన్నారు. మేళ్లచెరువు(Mellacheruvu) లోని శివాలయాన్ని ఆదివారం దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికలు(Loksabha Elections) సమీపిస్తుండటంతో అసంపూర్ణంగా ఉన్న రామమందిరంలో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ట చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, పీఠాధిపతి శంకరాచార్యులు(Shankaracharyulu) కూడా ఇదే మాట చెప్పారని అన్నారు. హిందూ ధర్మాన్ని పెంపొందించి, కాపాడే పీఠాధిపతులు కూడా అదే చెప్పారని గుర్తు చేశారు. హిందూ ధర్మం పట్ల మోదీ(Modi) కంటే పీఠాధిపతులే ఎక్కువ కృషి చేశారని, వారి నిర్ణయాన్ని గౌరివించి విగ్రహ పతిష్టకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ ఆలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తి అయిన తర్వాత తాను దేవున్ని దర్శించుకోవడానికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఎన్నికలలో లబ్దిపొందే దురుద్దేశ్యంతోనే ఇదంతా జరుగుతున్నట్లు తాను భావిస్తున్నానని వెల్లడించారు. బిజెపి(BJP), ఆర్ ఎస్ ఎస్(RSS) ఈవెంట్ లా జరుగుతున్నట్లు ఉందని అన్నారు.