క్యాలెండర్ ఆవిష్కరణ సభలో రైతుల రుణాల గురించి ప్రస్తావించిన తుమ్మల నాగేశ్వరరావు.
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన రైతుల రుణాల గురించి ప్రస్తావించారు. డీసీసీబీల్లో రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని ఆయన చెప్పారు. కొన్ని చోట్ల రైతులకు రుణాలు అందటంలేదని, అందరికీ రుణాలు అందజేయాలని ఆదేశించారు.
డీసీసీబీ లో పని తీరును గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కొన్ని బ్యాంకుల్లో కొన్ని అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. అలాంటివి జరగకుండా నూతన సంవత్సరంలో మంచి పనితీరును కనబర్చాలని చెప్పారు.
రైతు రుణ మాఫీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధాన హామీగా.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు రైతు భరోసపై కూడా చర్చలు జరుపుతుంది ప్రభుత్వం. ఇదే సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కొత్త రుణాల గురించి ఆదేశాలివ్వడం రైతులకు చేయూతను ఇవ్వనుంది.