రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ నారాయణ పేట జిల్లాలోని కర్ణాటక - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు.. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా కృష్ణ చెక్ పోస్టు ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పాటు ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గమనించిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.. స్ధానిక సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Srinivas Goud made a surprise inspection at the Krishna Check Post on the border between Karnataka and Telangana states
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud) నారాయణ పేట జిల్లా(Narayanapet District)లోని కర్ణాటక - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు(Karnataka-Telangana Boarder).. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా కృష్ణ చెక్ పోస్టు(Krishna Check Post)ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పాటు ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గమనించిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.. స్ధానిక సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్(Sarfaraj Ahmad) తో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సెల్ ఫోన్(Cell Phone) లో మాట్లాడి చెక్ పోస్ట్ లో తగినంత సిబ్బంది ని నియమించాలని ఆదేశించారు. అలాగే, రవాణా శాఖ, ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని చెక్ పోస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలైనా కర్ణాటక(Karnataka), గోవా(Goa), మహారాష్ట్ర(Maharastra) రాష్ట్రాల నుండి అక్రమంగా సరఫరా అవుతున్న నాన్ డ్యూటీ పెయిడ్(Non Duty Paid Liquore) లిక్కర్ పై ఉక్కు పాదం మోపాలని అధికారులని ఆదేశించారు.
రాయచూరు(Rayachur) నుండి మహబూబ్ నగర్(Mahboob Nagar) కు వస్తున్న మంత్రి ఆకస్మికంగా కృష్ణా బ్రిడ్జ్ సమీపంలో ఉన్న అంతరాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో ఉన్న చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ తగినంత సిబ్బంది లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండాల్సిన అధికారి ఎక్కడికి పోయారని ఆరా తీశారు. ఎక్సైజ్ విజిలెన్స్ సరిగా లేదని.. ఇలా అయితే అక్రమంగా వచ్చే మద్యాన్ని అడ్డుకట్ట వేయడం ఎలా సాధ్యమవుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా సరఫరా అవుతున్న మద్యాన్ని నియంత్రించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తెలంగాణకు సరఫరా అవుతున్న మద్యం పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కోరారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అవుతున్న మద్యం సురక్షితం కాదని.. దళారులు చెప్పే మాటలు నమ్మి వాటి బారిన పడి ప్రజలు అనారోగ్యానికి గురి కావద్దని మంత్రి సూచించారు.
అనంతరం, రాయచూరు నుంచి మక్తల్ వైపు వస్తున్న పలు వాహనాలను మంత్రి స్వయంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపాలని, తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇలాంటి పొరపాటు మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి(Chittem Ramohan Reddy), మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్(Rajeshwar Goud) తదతరులు పాల్గొన్నారు.
