2023 సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలేదని.. అప్పుడు ఎవరి సర్కార్ వుందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
2023 సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలేదని.. అప్పుడు ఎవరి సర్కార్ వుందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్ లోనే కదా.. వరుణ దేవుణ్ణి ఎందుకు అప్పుడు వర్షాలు పడలేదని ఎందుకు కోరలేదు అని మేము అడిగామా.. బిఆర్ఎస్ పార్టీకి వాటర్ ప్లానింగ్ లేదని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి రైతుకు అన్యాయం జరిగిందన్నారు.
మేము ధాన్యం కొనుగోలు కోసం ఐకెపి సెంటర్లను పెట్టామని తెలిపారు. ఒక్కగింజ లేకుండా కొనాలని చెప్పాము.. ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి కష్టపడుతున్నామని.. రుణమాఫీ కూడా చేస్తామన్నారు. వందరోజుల్లోనే హామీలు అమలు చేయడం లేదనీ, కొత్తవాళ్లు అడిగితే బాగుంటదని.. కానీ పదేండ్లు అధికారంలో వున్న బిఆర్ఎస్ నేతలు అడగడం బాధాకరమన్నారు. ఆర్థికవ్యవస్థను అతలాకుతం చేశారని.. ప్రణాళిక బద్దంగా ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దుతున్నామన్నారు.