కాంగ్రెస్ ఆనాడు అభివృద్ధి అడుగులు వేస్తే.. బీఆర్ఎస్ పదేళ్లు అనుభవించారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు చెయ్యకపోతే బీఆర్ఎస్ 12 గంటల కరెంట్ ఇచ్చేది కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ(Congress Party) మ్యానిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో మేము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీ లో శ్వేత పత్రం(White Paper) విడుదల చేశామన్నారు. శ్వేత పత్రాలు నిజమే.. అప్పులు చేసినం.. చేసిన ఖర్చు వల్ల ప్రయోజనాలు లేవని ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి యువకుడిపై 7 లక్షల అప్పును గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం మోపిందన్నారు.
కాంగ్రెస్ ఆనాడు అభివృద్ధి అడుగులు వేస్తే.. బీఆర్ఎస్ పదేళ్లు అనుభవించారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు చెయ్యకపోతే బీఆర్ఎస్ 12 గంటల కరెంట్ ఇచ్చేది కాదన్నారు. అప్పులపై జవాబు చెప్పలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు తెల్లమొహాలు పెట్టారన్నారు. రేషన్ బియ్యం పంపిణీ, రైతులకు మద్దతు ధర , విద్యా వ్యవస్థ పై సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ నాయకులు తెల్లమొహం వేసుకోని కూర్చున్నారని ఎద్దేవా చేశారు.
గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా విధానం ఎలా ఉంది అంటే తెల్లమొహం వేసుకోని కూర్చున్నారని విమర్శించారు. మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పలేక తెల్లమొహాలు వేసుకున్నారని అన్నారు. 2018లో అసెంబ్లీలో ఈ పార్టీ ఎంతసేపు మాట్లాడిందో లెక్కలు చెప్పలేదు.. ఎందుకంటే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు కాబట్టి.. లెక్కలు తప్పులు అనేది అవాస్తవం.. తేదీలు వెయ్యలేదు కాబట్టి కన్ఫ్యూజన్ ఏర్పడిందన్నారు.
అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవం.. కావాలంటే స్పీకర్ అదేశంతో ప్రతీ సభ్యుడికి అందిస్తామన్నారు. శ్వేత పత్రం లెక్కలు ఎవ్వరినీ కించపరచడానికి కాదన్నారు. రాష్ట్ర ప్రజలెవ్వరికీ సంశయం అవసరం లేదు.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్ వినియోగ దారులకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య దృక్పథంతో లెక్కలు ప్రజల ముందు పెట్టామన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తరువాత అసెంబ్లీ పెట్టీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారని గుర్తుచేశారు. మేము ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే అసెంబ్లీ(Assembly) పెట్టామని వివరించారు. ఎవరినో క్రిటిసైజ్ చేద్దామని అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదు. గత ప్రభుత్వం పాలనలో తప్పులు జరిగాయని అన్నారు.