జై భీం లాంటి మంచి సినిమాకు అవార్డు రాలేదు. కానీ పోలీసులను బట్టలూడదీసి నిలబెడితే పుష్ప సినిమాకు కేంద్రం నేషనల్ అవార్డు ఇచ్చింది.

జై భీం లాంటి మంచి సినిమాకు అవార్డు రాలేదు. కానీ పోలీసులను బట్టలూడదీసి నిలబెడితే పుష్ప సినిమాకు కేంద్రం నేషనల్ అవార్డు ఇచ్చింది. ఇది దేనికి సంకేతమని మంత్రి సీతక్క ప్రశ్నించారు. అల్లు అర్జున్, పుష్ప సినిమాలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్మగ్లర్ సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పోలీసులను ఒక స్మగ్లర్ బట్టలు ఇప్పదీసి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. జైభీం లాంటి సందేశాత్మక సినిమాకు అవార్డులు రాలేదు కానీ ఇలాంటి సినిమాలకు అవార్డులు వస్తే నేరాలు పెరిగవా అని ఆమె అడిగారు. పుష్ప2 విడుదల సందర్బంగా బెన్‌ఫిట్‌షోకు వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగి మహిళ రేవతి చనిపోయింది. ఈ వ్వవహారం చిలికిచిలికి దుమారంగా మారింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఎమ్మెల్సీ మల్లన్న కూడా ఇలాంటి సినిమాలు తీస్తారా అని సుకుమార్‌ను దుర్భాషలాడాడు. పుష్ప సినిమాకు నేషనల్ అవార్డా అంటూ మండి పడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సినీ ఇండస్ట్రీ స్పందించారు. గొప్ప వాళ్ళం అని విర్రవీగే సినీ నటులు ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్స్‌ను దత్తత తీసుకున్నారా అని నిలదీశారు. సామాజిక అంశాలపై స్పందించడానికి కూడా సినీ నటులు డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారన్నారు. పిల్లలకు పుస్తకాలు ఇద్దామని అంటే తనకేం వస్తుందని ఒక నటుడు అన్నారన్నారు. సినీతారలు రాతి హృదయంతో ఉంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ehatv

ehatv

Next Story