తెలంగాణ మహిళల పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(BRS Working President KTR)అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు మంత్రి సీతక్క(Minister Seethakka).

తెలంగాణ మహిళల పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(BRS Working President KTR)అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు మంత్రి సీతక్క(Minister Seethakka).ఆర్టీసీ బస్సుల(RTC Bus)లో మహిళలు బ్రేక్‌ డాన్స్‌లు(Break Dances),రికార్డింగ్‌ డాన్స్‌(Recording Dances)లు చేసుకోవచ్చని కేటీఆర్ అనడం అత్యంత జుగుస్పాకరమని సీతక్క వ్యాఖ్యానించారు. మీ తండ్రిగారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్‌ అని ప్రశ్నించారు. మీ ఆడపడచులంతా బ్రేక్ డాన్సులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆడవాళ్లంటే కేటీఆర్‌కు గౌరవం లేదని సీతక్క అన్నారు. తెలంగాణ(Telangana) మహిళలకు కేటీఆర్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం కేటీఆర్‌ బుర్రలో వున్న బురదకు నిదర్శనమని సీతక్క అన్నారు. గత పది సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బులు(Hyerabad Clubs),పబ్బులు(Pubs),బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌(BRS)దేనని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నామని వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగానే పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు సీతక్క.

ehatv

ehatv

Next Story