బీజేపీ బీసీల‌ వ్యతిరేక పార్టీ.. రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్ లో జ‌రిగిన‌ కురుమ ఆత్మీయ సమ్మేళనంలో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీకి 400 సీట్లు వస్తే.. బీసీలు ఆగమేన‌న్నారు.

బీజేపీ బీసీల‌ వ్యతిరేక పార్టీ.. రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్ లో జ‌రిగిన‌ కురుమ ఆత్మీయ సమ్మేళనంలో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీకి 400 సీట్లు వస్తే.. బీసీలు ఆగమేన‌న్నారు. అందుకే ఉత్తర భారత దేశం గ్రహించి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసింది. పాంచ్ న్యాయ్ అని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. బీజేపీ రాముణ్ణి నమ్ముకొని రాజకీయం చేస్తుందని అన్నారు. బీజేపీ రిజర్వేషన్ లను టచ్ చేస్తే.. తొడ్కలు తీస్తామ‌ని హెచ్చ‌రించారు. బీజేపీ నేతలు నిన్నటి నుండి రిజర్వేషన్లు తీయం అంటున్నారని అన్నారు. గొల్ల కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేశామ‌ని మంత్రి పొన్నం తెలిపారు. ఐతే కురుమ కార్పొరేషన్ వేరుగా ఏర్పాటు చేయాలనీ బీర్ల ఐలయ్య కోరారు. దానికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్నికల కోడ్ ఐపోగానే ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కోట్ల మంది మంగళ సూత్రాలను నిలబెట్టిందని అన్నారు. 4 వందల సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు తీసివేయాలని బీజేపీ చూస్తుందన్నారు. దేశ సంపదను మోదీ ఆదానీ, అంబానీ లకు కట్టబెట్టాలని చుస్తున్నార‌ని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కులగగణ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు లో అఫిడవిట్ వేసిందన్నారు.

Updated On 29 April 2024 3:50 AM GMT
Yagnik

Yagnik

Next Story