కాంగ్రెస్ పార్టీకి(Congress Party), సీఎం రేవంత్ కు(Cm Revanth Reddy) ఉన్న కమిట్ మెంట్ కి నిదర్శనం రెండు గ్యారంటీల అమలు అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. గాంధీ భ‌వ‌న్‌లో(Gandhi Bhavan) ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏకఛత్రాధిపత్యంగా ఉండదని స్ప‌ష్టం చేశారు. తుక్కుగుడ విజయభేరీ సభలో సోనియా గాంధీ(Sonia Gandhi) ఇచ్చిన 6 హామీల్లో రెండు అమలు చేశామ‌ని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి(Congress Party), సీఎం రేవంత్ కు(Cm Revanth Reddy) ఉన్న కమిట్ మెంట్ కి నిదర్శనం రెండు గ్యారంటీల అమలు అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. గాంధీ భ‌వ‌న్‌లో(Gandhi Bhavan) ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏకఛత్రాధిపత్యంగా ఉండదని స్ప‌ష్టం చేశారు. తుక్కుగుడ విజయభేరీ సభలో సోనియా గాంధీ(Sonia Gandhi) ఇచ్చిన 6 హామీల్లో రెండు అమలు చేశామ‌ని తెలిపారు. తొమ్మిది వేలకు పైగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం ప్రారంభించాం. ప్రతి రోజు 45 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని వివ‌రించారు. నా శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం చాలా సంతోషం గా ఉందన్నారు.

గత పాలనలో ప్రజలకు సెక్రటేరియట్, ప్రగతి భవన్ లోకి అనుమతి లేకుండా పోయింది. వాటిని పూర్తిగా మార్చామ‌ని తెలిపారు. ప్రజల సమస్యలు వినడానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజా దర్బార్(Praja Darbar) నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జిల్లాలకు విస్తరిస్తామ‌ని తెలిపారు. అధికారంలోకి వచ్చి కేవలం రెండు రోజులే అయ్యింది. మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు.. అధికారంతో పాటు వాళ్ళు విచక్షణ కూడా కోల్పోయారని కామెంట్ చేశారు.

Updated On 11 Dec 2023 12:07 AM GMT
Ehatv

Ehatv

Next Story