కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..
కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) అనేక సందర్భాల్లో దేశంలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాగానే బలహీన వర్గాలకు న్యాయం చేయాలని.. కుల జన గణన చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto) అధికారంలోకి రాగానే బీసీ కుల గణాన చేస్తామని చెప్పడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రితో శాఖ పరంగా జరిగిన సమావేశంలో బీసీ కుల గణన పైన చర్చ జరిగిందని తెలిపారు. కులగణన చేస్తామని మాట ఇచ్చాం.. చేస్తున్నామని తెలిపారు.
వచ్చే శాసన సభ సమావేశాల్లో బీసీ కుల గణన చట్టభద్దంపై చర్చ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల జన గణన జరుగుతుందన్నారు. ఇందుకు నిదర్శనం తెలంగాణలో బీసీ కుల జన గణనేనన్నారు. ఫ్రొఫెసర్లు, మేధావులు, బీసీ సంఘాల సలహాలు సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో అవసరమైన నిధుల కేటాయింపు కూడా జరగబోతుందన్నారు. శాస్త్రీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంలో మీకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ది ఉంటే మీరు కూడా వచ్చి సలహాలు ఇవ్వవచ్చన్నారు. మా మేనిఫెస్టో అమలు కు సంబంధించి ముందుకు వెళ్తున్నాం.. మీరంతా సహకరించాలని కోరారు.
ఎవరు వచ్చినా బలహీన వర్గాల్లొ వారి వాట ఉంటుంది.. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఉపయోగపడుతుందన్నారు. మెస్ చార్జీలు ఎక్కడ కూడా ఆగకుండా చూస్తున్నాం.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తాం.. గత కొద్ది సంవత్సరాలుగా మెస్ చార్జీలు రాలేదు.. సంక్షేమానికి సంబందించి వెల్ఫెర్ ఏడ్యుకేషన్ కి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. పది సంవత్సరాలు బీఆర్ఎస్ కి ఫూలే గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఇచ్చాక సామాజిక న్యాయం గురించి మాట్లాడాలన్నారు. ఫూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తోందన్నారు. కవిత లిక్కర్ కేసులో బిజీ లేనట్టుంది.. అందుకే కొత్త నినాదం ఎత్తుకుందన్నారు. 10 సంవత్సరాలు జ్యోతిరావు పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజకీయం చేయాలనుకుంటే బయట చేయండి.. శాసన సభ ఆవరణలో శాసన సభ్యురాలు కాని వ్యక్తి రాజకీయాలు చేయడం తగదన్నారు. మీ పార్టీ అధ్యక్ష పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, ప్రతిపక్ష నేత పదవి బీసీలకు ఇవ్వండి.. అప్పుడు మీకు చిత్తశుద్ది ఉన్నట్టని మంత్రి అన్నారు.