తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్టుగానే బాంబుల మోత మోగనుందా?
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్టుగానే బాంబుల మోత మోగనుందా? ఐఎఎస్ ఆఫీసర్ అమోయ్‌కుమార్ ఈడీకి అప్రూవర్‌గా మారిపోయారా? మూడు రోజుల విచారణ జరిపింది ఇందుకేనా? భూ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా? నిజంగానే కేసీఆర్ కుటుంబం స్కామ్‌లో చిక్కుకోబోతున్నదా? ఈ ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. కేసీఆర్ (KCR)ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్(Dharani Portal) భూ వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టలేదు కానీ భూములకు రెక్కలొచ్చేలా చేసిందన్నదన్న విమర్శలు ఉన్నాయి. ఈడీ విచారణను ఎదుర్కొంటున్న అమోయ్‌కుమార్ ధరణి పేరుతో ఎన్నో అక్రమాలు సాగించారని ఈడీ విచారణలో తెలుస్తున్నదట! ఈడీకి అమోయ్ అప్రూవర్‌గా మారిపోయినట్టు సమాచారం. ఇది నిజమైతే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీకి ఈడీ సెగ తగలే అవకాశం ఉంది. పొంగులేటి చెప్పిన బాంబు ఇదేకావచ్చుననే టాక్ కూడా వినిపిస్తోంది. విచారణ సందర్భంగా ఈడీ (ED)ఎన్నో ప్రశ్నలు వేసింది. ముందు జవాబు చెప్పడానికి అమోయ్ మొండికేసినప్పటికీ తర్వాత చెప్పాల్సి వచ్చింది. గోపాన్నపల్లి భూ వ్యవహారాలు, బినామీల రూపంలో ఉన్న నగదుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అమోయ్ ఆస్తుల వివరాలను కూడా ఆయన ముందు పెట్టి ప్రశ్నలు అడిగారు ఈడీ అధికారులు. ఇక తప్పని పరిస్థితిలో అమోయ్ అప్రూవర్‌గా మారారట! ఈ కేసుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి కావొచ్చు.