మైనంపల్లి(Mainampally) వ్యాఖ్యలను బీఆర్ఎస్(BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఖండించారు. ఈ మేర‌కు ట్విట‌ర్(Twitter) వేదిక‌గా ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నాయ‌కులంద‌రూ మంత్రి హరీశ్‌రావు(Harish rao) వెంట ఉంటామని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు పార్టీతో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్‌ మూలస్తంభంగా కొనసాగుతారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

మైనంపల్లి(Mainampally) వ్యాఖ్యలను బీఆర్ఎస్(BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఖండించారు. ఈ మేర‌కు ట్విట‌ర్(Twitter) వేదిక‌గా ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నాయ‌కులంద‌రూ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) వెంట ఉంటామని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు పార్టీతో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్‌ మూలస్తంభంగా కొనసాగుతారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

మైనంప‌ల్లి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో నా తడాఖా చూపిస్తాన‌ని అన్నారు. హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తాను అని దేవుడు మీద ప్రమాణం చేశారు. హనుమంతరావు మాట ఇస్తేతప్పడు.. ఆయ‌న‌ దుకాణం బంద్ చేసే వరకు నిద్రపోనని.. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నానని వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు నెట్టింట సంచ‌ల‌నం సృష్టించాయి. అయినా మైనంప‌ల్లికి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించింది.

Updated On 21 Aug 2023 7:55 AM GMT
Ehatv

Ehatv

Next Story