మంత్రి కేటీఆర్(Minister KTR) ట్విట‌ర్ వేదిక‌గా లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా(Om Birla)ను ప్రశ్నించారు. నిన్న లోక్‌స‌భ‌లో బండి సంజ‌య్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. గ‌తంలో ప్రధాని ఇంటిపేరుపై వ్యాఖ్య‌లు చేసిన‌ కాంగ్రెస్ ఎంపీ లోక్‌స‌భ‌ సభ్యత్వంపై అనర్హత‌ వేటు వేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ నిన్న లోక్‌సభలో తెలంగాణా రాష్ట్రానికి రెండుసార్లు ఎన్నికైన జ‌నాధ‌ర‌ణ క‌లిగిన‌ సీఎం కేసీఆర్‌ను అత్యంత నీచమైన భాషలో కించపరిచారు.

మంత్రి కేటీఆర్(Minister KTR) ట్విట‌ర్ వేదిక‌గా లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా(Om Birla)ను ప్రశ్నించారు. నిన్న లోక్‌స‌భ‌లో బండి సంజ‌య్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. గ‌తంలో ప్రధాని ఇంటిపేరుపై వ్యాఖ్య‌లు చేసిన‌ కాంగ్రెస్ ఎంపీ లోక్‌స‌భ‌ సభ్యత్వంపై అనర్హత‌ వేటు వేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ నిన్న లోక్‌సభలో తెలంగాణా రాష్ట్రానికి రెండుసార్లు ఎన్నికైన జ‌నాధ‌ర‌ణ క‌లిగిన‌ సీఎం కేసీఆర్‌ను అత్యంత నీచమైన భాషలో కించపరిచారు. మీరు/మేము ఇప్పుడు ఏమి చేయాలి స్పీకర్ సార్? అంటూ ప్ర‌శ్నించారు.

నిన్న లోక్ స‌భ‌లో బండి సంజ‌య్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అంటే ఖాసిం చంద్రశేఖర్‌ రిజ్వీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూపీఏ కూటమి.. ఇండియాగా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్‌ రాక్షస సమితి అని అన్నారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుమారుడి ఆస్తులు 400 రెట్లు, సీఎం భార్య ఆస్తులు 1800 శాతం పెరిగాయని ఆరోపించారు. తెలంగాణ రైతుల సగటు ఆదాయం రూ.1,12,236 అయితే.. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయం ద్వారా ఆదాయం రూ.కోటి.. కుమారుడి వ్యవసాయ ఆదాయం రూ.59,85,000 ఆదాయం అర్జించారని చెప్పారు. తెలంగాణ రైతుల ఆదాయం పెరగలేదు కానీ.. సీఎం కుటుంబం ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించారు.

Updated On 11 Aug 2023 12:26 AM GMT
Ehatv

Ehatv

Next Story